తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మరోసారి భేటీ కానున్న ప్రశాంత్ కిశోర్
- ఇప్పటికే పలుసార్లు కేసీఆర్, పీకే భేటీ
- ఈ నెల 18న కేసీఆర్‌కు పీకే నివేదిక
- ప్రగతి భవన్‌లో సమావేశమయ్యే అవకాశం
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాలపై కేసీఆర్‌కు పీకే నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై కేసీఆర్ కు వివరాలు తెలపనున్నట్లు సమాచారం. కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ లో వీరు సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై కూడా వారు చర్చిస్తారని తెలుస్తోంది.