ఫారిన్ టూర్‌లో కోమ‌టిరెడ్డి!.. న‌యా లుక్‌లో కాంగ్రెస్ ఎంపీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫారిన్ టూర్‌లో కోమ‌టిరెడ్డి!.. న‌యా లుక్‌లో కాంగ్రెస్ ఎంపీ!

komatireddy venkat reddy in foriegn tour
  • క్రొయేషియాలో ప‌ర్య‌టిస్తున్న కోమ‌టిరెడ్డి
  • సెయింట్ యూఫేమియా చ‌ర్చిని సంద‌ర్శించిన నేత‌
  • జీన్స్‌, టీ ష‌ర్ట్‌లో క‌నిపించిన భువ‌న‌గిరి ఎంపీ
భువ‌న‌గిరి పార్ల‌మెంటు స‌భ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ప్ర‌స్తుతం విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన మేధోమ‌థ‌న స‌ద‌స్సు జ‌రుగుతుంటే...కోమ‌టిరెడ్డి మాత్రం ఎంచ‌క్కా ఫారిన్ టూర్‌కు చెక్కేశారు. శుక్ర‌వారం క్రొయేషియాలో ఉన్న కోమ‌టిరెడ్డి... ఆ దేశ ప్రధాన న‌గ‌రం కోవింజ్‌లోని సెయింట్ యూఫేమియా చ‌ర్చిని సంద‌ర్శించారు. 

చ‌ర్చిలో తాను తీయించుకున్న ఫొటోల‌ను కోమ‌టిరెడ్డే నిన్న రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత‌ స్వ‌యంగా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. సెయింట్ యూఫేమియా చ‌ర్చిని బాసిలికా ఆఫ్ సెయింట్ యూఫేమియా అని కూడా పిలుస్తారంటూ ఆయ‌న కామెంట్ పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో ఖ‌ద్దరు వ‌దిలేసిన కోమ‌టిరెడ్డి...ఎంచ‌క్కా జీన్స్, టీ ష‌ర్ట్‌లో కాలేజీ కుర్రాడిలా క‌నిపిస్తున్నారు.
Congress
Bhongir MP
Komatireddy Venkat Reddy
Croatia

More Telugu News