ప్రభాస్ సరసన నాయికలుగా తెరపైకి ఇద్దరు భామల పేర్లు!

Spirit movie update
  • పెరుగుతున్న రష్మిక జోరు  
  • విజయ్ - వంశీ పైడిపల్లి సినిమాలో దక్కిన అవకాశం 
  • ప్రభాస్ 'స్పిరిట్' కోసం ఆమెను సంప్రదించారంటూ టాక్
  • మరో కథానాయికగా తెరపైకి కియారా అద్వాని పేరు
తెలుగు .. తమిళ భాషల్లో రష్మికకి మంచి క్రేజ్ ఉంది. ఇక బాలీవుడ్ లోను చక్రం తిప్పే ఛాన్స్ కోసం అమ్మడు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ ఆమె అదృష్టం ఎలా ఉందనేది ఈ ఏడాది తెలిసిపోవచ్చు. 'పుష్ప'లో శ్రీవల్లి పాత్రలో మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీ, 'పుష్ప 2' సినిమా కోసం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. 

ఇక తమిళంలో కార్తి జోడీగా ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి, తమిళ .. తెలుగు భాషల్లో రూపొందే ఒక సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అది కూడా విజయ్ సరసన. విజయ్ హీరోగా ఆయన 66వ సినిమా రూపొందనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నాడు. 

ఆ తరువాత సినిమాను ఆమె ప్రభాస్ సరసన చేయనున్నట్టుగా తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ 'స్పిరిట్' చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికల కోసం కియారాను .. రష్మికను సంప్రదిస్తున్నట్టుగా సమాచారం. మరి ఇద్దరినీ తీసుకుంటారా? లేక ఎవరినైనా ఒకరినే ఎంపిక చేసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Prabhas
Rashmika Mandanna
Kiara Adwani
Spirit Movie

More Telugu News