Sajjala Ramakrishna Reddy: నారాయ‌ణ అరెస్ట్‌పై స‌జ్జ‌ల స్పంద‌న ఇదే

sajjala response on narayana arrest
  • అధికారుల‌కు స్వేచ్ఛ‌తోనే నారాయ‌ణ దొరికిపోయారన్న సజ్జల 
  • రికార్డుల కోసం నారాయ‌ణ త‌ప్పుడు విధానాలకు పాల్పడ్డారని విమర్శ 
  • గ‌త ప్ర‌భుత్వం దీనిని ప్రోత్స‌హించిందన్న సజ్జ‌ల‌
టెన్త్ ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీ వ్య‌వ‌హారంలో టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ అరెస్ట్‌ కావడంపై వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తాజాగా స్పందించారు. అధికారుల‌కు స్వేచ్ఛ ఇవ్వ‌డం వ‌ల్ల‌నే నారాయ‌ణ దొరికిపోయార‌న్న స‌జ్జ‌ల‌.. రికార్డుల పేరుతో నారాయ‌ణ త‌ప్పుడు విధానాల‌కు పాల్ప‌డ్డార‌ని వ్యాఖ్యానించారు. 

కాపీయింగ్‌ను ఆర్గ‌నైజ్డ్ క్రైమ్‌ (వ్యవస్థీకృత నేరం)గా నారాయ‌ణ చేయించారన్న ఆయ‌న‌... ఇలాంటి త‌ప్పుడు విధానాన్ని గ‌త ప్ర‌భుత్వం ప్రోత్స‌హించిందని ఆరోపించారు. ప్ర‌స్తుత‌ ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో త‌ప్పు బ‌య‌ట‌ప‌డిందని స‌జ్జ‌ల చెప్పారు. చ‌ట్టం ఎవ‌రి విష‌యంలో అయినా స‌మానంగా ప‌ని చేస్తుందని, ప్ర‌భుత్వం దృష్టిలో ఎవ‌రైనా ఒక‌టేన‌ని తెలిపారు. త‌ప్పు చేశార‌ని తెలియ‌డం వ‌ల్లే వైఎస్ కొండారెడ్డిని అరెస్ట్ చేశారంటూ స‌జ్జ‌ల వ్యాఖ్యానించారు.
Sajjala Ramakrishna Reddy
YSRCP
P Narayana

More Telugu News