Karumuri Nageswar Rao: చంద్రబాబుకు కూడా పోలీసులు నోటీసులు ఇస్తారు: మంత్రి కారుమూరి

Police will give Notice to Chandrababu says Karumuri
  • అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు
  • ఏ1గా చంద్రబాబు.. ఏ2గా నారాయణ
  • తప్పు చేస్తే అరెస్టులు చేస్తారన్న కారుమూరి
ఓ వైపు ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ వ్యవహారం కలకలం రేపుతున్న తరుణంలోనే... మరోకేసు తెరపైకి వచ్చింది. అమరావతి ల్యాండ్ పూలింగ్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఏపీ సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏ1గా, నారాయణను ఏ2గా పేర్కొన్నారు. 

ఈ నేపథ్యంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ కేసులో ఏ1గా ఉన్న చంద్రబాబుకు కూడా నోటీసులు ఇస్తారని చెప్పారు. తప్పు చేస్తే అరెస్టులు చేస్తారని... చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. అరెస్టుల వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని చెప్పారు. 

నారాయణ అరెస్ట్ పై స్పందిస్తూ... ర్యాంకుల కోసం నారాయణ దుర్మార్గంగా వ్యవహరించారని ఆరోపించారు. నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు పేపర్ లీక్ జరిగిందో, లేదో తనకు తెలియదని చెప్పారు.
Karumuri Nageswar Rao
YSRCP
Chandrababu
P Narayana
Telugudesam

More Telugu News