Mahesh Babu: బాలీవుడ్ నన్ను భరించలేదు: మహేశ్ బాబు

  • హిందీ నుంచి తనకు అవకాశాలు పెద్దగా రాలేదన్న మహేశ్ 
  • అక్కడికి వెళ్లే ఆలోచన చేయనని స్పష్టీకరణ 
  • తనకు గుర్తింపు, స్టార్ డమ్ వచ్చిన చోటే ఉంటానని వెల్లడి 
Mahesh Babu says Bollywood cant afford me I dont want to waste my time

దక్షిణాదిన తెలుగు పరిశ్రమలో గొప్ప స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరో మహేశ్ బాబు బాలీవుడ్ వైపు ఎందుకు వెళ్లలేదు..? ఇదే ప్రశ్న ఇటీవల ఓ కార్యక్రమం సందర్భంగా మహేశ్ బాబు ఎదుర్కొన్నారు. తనను బాలీవుడ్ పరిశ్రమ భరించలేదంటూ ఆయన ఇచ్చిన సమాధానం అవాక్కయ్యేలా చేసింది. 

‘‘హిందీ పరిశ్రమ నుంచి నాకు ఎక్కువ ఆఫర్లు రాలేదు. నన్ను వారు భరించగలరని అనుకోవడం లేదు. నన్ను భరించలేని పరిశ్రమలో పనిచేయడం ద్వారా నా సమయం వృథా చేసుకోవాలని అనుకోవడం లేదు. ఇక్కడి పరిశ్రమలో నాకు వచ్చిన గుర్తింపు, గౌరవం, స్టార్ డమ్ పట్ల నేను సంతోషంగా ఉన్నాను. అందుకే, నా పరిశ్రమను విడిచి పెట్టే ఆలోచన చేయను. సినిమాలు చేయాలని, మరింత ఎత్తుకు ఎదగాలనే ఎప్పుడూ అనుకుంటాను. నా కల ఇప్పుడు నెరవేరుతోంది’’ అంటూ మహేశ్ బాబు వివరించారు. 

మహేశ్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' ఈ నెల 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల విరామం తర్వాత మహేశ్ బాబు కనిపించబోయే సినిమా ఇది. చివరిగా 2020లో విడుదలైన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఆయన నటించారు. సర్కారు వారి పాట తర్వాత రాజమౌళి సినిమా ప్రాజెక్టులో మహేశ్ పనిచేయనున్నారు. 

More Telugu News