ఉన్నట్టుండి స్వదేశానికి ప్రయాణమైన హెట్ మేయర్..

Rajasthan Royals Shimron Hetmyer leaves bio bubble for the birth of his first child
  • మొదటిసారి బేబీని ప్రసవించనున్న భార్య
  • తొలి సంతానాన్ని ఆహ్వానించేందుకు వెళ్లిన గయనా క్రికెటర్
  • కీలక సమయంలో భార్య పక్కన ఉండాలన్న నిర్ణయం
రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించే ముఖ్య ఆటగాడు సిమ్రాన్ హెట్ మేయర్ ఉన్నట్టుండి బయో బబుల్ వీడాడు. ఆదివారం ఉదయం స్వదేశం గయానాకు ప్రయాణమయ్యాడు. అతడి భార్య నిర్వాణి తొలి బేబీని ప్రసవించనుంది. అత్యంత కీలకమైన ఈ సమయంలో తాను భార్య పక్కనే ఉండాలని హెట్ మేయర్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రకటించింది.

గయానీస్ క్రికెటర్ స్వదేశానికి వెళ్లాడని.. మిగిలిన మ్యాచ్ లకు రాజస్థాన్ జట్టుతో వచ్చి చేరతాడని తెలిపింది. రాజస్థాన్ జట్టు సభ్యులు అభినందనలు తెలుపుతున్న వీడియోను పోస్ట్ చేసింది. ‘‘బేబీలు ఒక్కసారే జన్మిస్తారు. అందుకే ఈ సమయంలో నేను నా భార్య, కుటుంబంతో ఉండాలన్న నిర్ణయాన్ని తీసుకున్నాను’’అంటూ హెట్ మేయర్ చెప్పాడు.

ఈ విషయంలో హెట్ మేయర్ కు తాము చేతనైనంత సాయంగా నిలుస్తామని రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రకటించింది. అతడు త్వరలోనే తిరిగొస్తాడని పేర్కొంది. శనివారం పంజాబ్ జట్టుపై విజయంలో హెట్ మేయర్ కీలక పాత్ర పోషించడం తెలిసిందే. తద్వారా ప్లేఆఫ్ అవకాశాలు మెరుగుపరుచుకుంది.
Go Back to Shorts
Shimron Hetmyer
Rajasthan Royals
leaves
bio bubble
baby birth

More Telugu News