ఏపీ సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి.. ఐఏఎస్ లను బదిలీ చేసిన ప్రభుత్వం

  • టీటీడీ ఈవో విధుల నుంచి రిలీవ్ 
  • కొత్త ఈవోగా ఏఈవో ధర్మారెడ్డికి ప్రమోషన్
  • మైనారిటీ శాఖ కార్యదర్శిగా ఇంతియాజ్ కు అదనపు బాధ్యతలు
ఏపీ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇవాళ ఉదయం పలువురు ఉన్నతాధికారులను ట్రాన్స్ ఫర్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా ఉన్న జవహర్ రెడ్డిని ఆ విధుల నుంచి తప్పించి.. సీఎం జగన్ కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. టీటీడీ ఏఈవో ధర్మారెడ్డికి ఈవోగా ప్రమోషన్ ఇచ్చింది. 

స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా సత్యనారాయణకు స్థాన చలనం కల్పించింది. ప్రస్తుతం యువజన సర్వీసుల శాఖ కమిషనర్ గా ఉన్న నాగరాణిని రిలీవ్ చేసి.. ఆ స్థానంలో శారదా దేవిని నియమించింది. సెర్ప్ సీఈవో ఇంతియాజ్ ను మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమిస్తూ అదనపు బాధ్యతలను అప్పగించింది.

Andhra Pradesh
IAS
Transfers
CMO
YS Jagan

More Telugu News