దేశంలో కొత్తగా 3,451 కరోనా కేసులు నమోదు
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న దేశంలో 3,451 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, కరోనా వల్ల 40 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 20,635 మంది చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది.
నిన్న కరోనా నుంచి 3,079 మంది కోలుకున్నారని వివరించింది. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,25,57,495కి పెరిగిందని పేర్కొంది. మృతుల సంఖ్య మొత్తం 5,24,064కి పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.