ఉత్తర కోస్తాంధ్రకు దగ్గరగా రానున్న తుపాను... ఏపీ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు
- బంగాళాఖాతంలో అల్పపీడనం
- వాయుగుండంగా మారుతుందన్న వాతావరణ శాఖ
- రేపటికి తుపానుగా మారే అవకాశం
- ఏపీకి వర్ష సూచన
ఇది తుపానుగా మారిన తర్వాత వాయవ్య దిశగా పయనించే క్రమంలో ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీరాలకు చేరువగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని వెల్లడించింది. 10వ తేదీ నాటికి ఇది దిశ మార్చుకుని ఉత్తర వాయవ్య దిక్కులో పయనిస్తుందని ఐఎండీ పేర్కొంది.