తండ్రి అఘాయిత్యాన్ని వీడియోతో బయటపెట్టిన యువతి
- కుమార్తెపై ఓ ఉపాధ్యాయుడి అత్యాచారం
- రహస్యంగా వీడియో తీసి బయటపెట్టిన బాలిక
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
వేరే మార్గం లేక తనపై తండ్రి చేస్తున్న దారుణాన్ని రహస్య కెమెరాలో బంధించి సామాజిక మాధ్యమం వేదికగా పది మందితో పంచుకుంది బాధితురాలు. తనకు న్యాయం చేయాలని కోరింది. దీంతో పోలీసులు ఆమెను సంప్రదించారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసినట్టు రొసెరా డీఎస్పీ సహియార్ అక్తర్ తెలిపారు.
నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో ఇతర నిందితులు ఎవరైనా ఉన్నారా? అన్న సమాచారాన్ని రాబట్టే పనిలో ఉన్నట్టు డీఎస్పీ తెలిపారు. బాలిక తల్లి సైతం ఈ దారుణాలను చూస్తున్నా, తనపై వచ్చిన ఒత్తిడి వల్ల మిన్నకుండిపోయింది.