YSRCP: దుగ్గిరాల ఎంపీటీసీ ప‌ద్మావ‌తి అదృశ్యంపై క్లారిటీ ఇచ్చిన‌ ఎమ్మెల్యే ఆర్కే

alla ramakrishna reddy comments on duggirala mptc kidnap
షార్ట్స్‌లో చూడండి
గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని దుగ్గిరాల ఎంపీటీసీ ప‌ద్మావ‌తి అదృశ్య‌మై రెండు రోజులు గడుస్తోంది. దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక నేప‌థ్యంలో వైసీపీ రెబ‌ల్ అభ్య‌ర్థిగా ప‌ద్మావ‌తి బ‌రిలోకి దిగుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో త‌న త‌ల్లి ప‌ద్మావ‌తిని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి అనుచరులు తమ వెంట తీసుకెళ్లార‌ని యోగేంద్ర నాధ్ బుధ‌వారం నాడు ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. 

తాజాగా ఎంపీపీ ఎన్నిక‌లు గురువారం ముగిసిన త‌ర్వాత కూడా ప‌ద్మావ‌తి జాడ క‌నిపించ‌క‌పోవ‌డంపై ఆమె కుటుంబం కోర్టును ఆశ్ర‌యించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌కటించింది. ఈ నేప‌థ్యంలో ప‌ద్మావ‌తి అదృశ్యంపై ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి తాజాగా స్పందించారు. 

ఎంపీపీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా క్యాంపు రాజకీయాలు స‌ర్వ‌సాధార‌ణ‌మ‌ని చెప్పిన ఆర్కే... అందులో భాగంగానే ప‌ద్మావ‌తిని త‌మ వెంట తీసుకెళ్లిన‌ట్లు చెప్పారు. అయినా ఏడాదిన్న‌ర క్రిత‌మే ముగియాల్సిన దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక టీడీపీ వైఖ‌రి కార‌ణంగా వాయిదా ప‌డింద‌ని ఆయ‌న ఆరోపించారు. టీడీపీ నేత‌లు త‌న త‌ల్లిని ప్ర‌లోభాల‌కు గురి చేస్తున్నారంటూ ఆమె కుమారుడు యోగేంద్ర నాథ్ గ‌తంలో పోలీసుల‌కు ఫిర్యాదు కూడా చేశార‌ని ఆయ‌న తెలిపారు.
Go Back to Shorts
YSRCP
Duggirala
Mangalagiri
Guntur District
Alla Ramakrishna Reddy

More Telugu News