రాహుల్ గాంధీ ఎక్కడికెళితే అక్కడ కాంగ్రెస్ గల్లంతు: హరీశ్ రావు
- చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న హీన చరిత్ర కాంగ్రెస్‌దన్న హరీశ్
- రాహుల్ తెలంగాణకు ఎందుకు వస్తున్నారో చెప్పాలని డిమాండ్
- రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ కంటే దిగజారిందన్న హరీశ్
ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు.. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై స్పందించారు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు ఎందుకు వస్తున్నారో చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ బాధ్యతలు తీసుకున్న తర్వాత జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కంటే హీనంగా మారిపోయిందన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న హీనమైన చరిత్ర కాంగ్రెస్‌దని హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.