'వీరమల్లు' విషయంలో లేటెస్ట్ టాక్ ఇదే!
- 'వీరమల్లు' విషయంలో జరుగుతున్న ఆలస్యం
- ఏకధాటిగా షూటింగు జరపాలనేదే క్రిష్ ఆలోచన
- ఆ దిశగానే కష్టపడుతున్న పవన్ కల్యాణ్
- వీలైతే దసరాకి .. లేదంటే సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశం
ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా, మిగతా 50 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకోవలసి ఉంది. ఈ సినిమా కోసం భారీ సెట్లను వేయించారు. కొన్ని మైదానాలను సిద్ధం చేశారు. ఈ లొకేషన్లలో నాన్ స్టాప్ గా షూటింగును పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ ప్రణాళిక ప్రకారమే అన్ని పనులు జరుగుతున్నాయి.
అంతా అనుకున్నట్టుగా జరిగితే ఈ 'దసరా'కి .. లేదంటే 'సంక్రాంతి'కి రిలీజ్ చేయాలనే ఒక నిర్ణయానికి నిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. పవన్ సరసన నాయికగా నిధి అగర్వాల్ అందాల సందడి చేయనుంది. అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు.