రంజాన్ సందర్భంగా సరిహద్దుల్లో స్వీట్లు పంచుకున్న భారత్, పాక్ జవాన్లు
- సరిహద్దులోన్లూ ఈద్-ఉల్-ఫితర్ స్ఫూర్తి
- పలు సెక్టార్లలో స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్న జవాన్లు
- శాంతి స్థాపనకు ఎప్పుడూ ముందుంటామన్న బీఎస్ఎఫ్
దీనిపై బీఎస్ఎఫ్ స్పందిస్తూ, సరిహద్దుల్లో శాంతియుత, సౌహార్ద్ర వాతావరణం నెలకొల్పేందుకు బీఎస్ఎఫ్ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొంది. ఇలాంటి చర్యల ద్వారా ఇరు దేశాల బలగాల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయని బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. అటు, బంగ్లాదేశ్ జవాన్లతోనూ బీఎస్ఎఫ్ జవాన్లు ఇదే రీతిలో మిఠాయిలు పంచుకున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలను బీఎస్ఎఫ్ సోషల్ మీడియాలో పంచుకుంది.
.