కెరీర్ నాశనం కాకూడదని వార్నింగ్ ఇచ్చి వదిలేశారు: తమన్
- మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా సర్కారు వారి పాట
- మే 12న రిలీజ్
- ప్రమోషన్ ఈవెంట్స్ లో తమన్
- ఆసక్తికర అంశం వెల్లడి
కాగా, సర్కారు వారి పాట చిత్రానికి పాటల కోసం ఎంతో కష్టపడ్డామని, కానీ ఓ పాట లీక్ కావడం తమను ఎంతో బాధకు గురిచేసిందని తెలిపాడు. ఆ పాటను ఎవరు లీక్ చేశారో గుర్తించామని వెల్లడించాడు. అయితే, సర్కారు వారి పాట నిర్మాతలు మానవతా దృక్పథంతో వారిని విడిచిపెట్టారని తమన్ పేర్కొన్నాడు. వాళ్ల కెరీర్ నాశనం కాకూడదన్న ఉద్దేశంతో పెద్దమనసుతో ఆలోచించిన నిర్మాతలు కేవలం వార్నింగ్ ఇచ్చి పంపించారని వివరించాడు.
కరోనా సంక్షోభం వల్ల టాలీవుడ్ నిర్మాతలు ఎంతో నష్టపోయారని, అలాంటి సమయంలో ఇలాంటి లీకులు ఎలా చేస్తారో అర్థం కాదని అన్నారు. ఎవరైనా ఇండస్ట్రీ బాగు కోరుకోవాలని తమన్ హితవు పలికారు.