Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స‌న్‌ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆట‌గాడు ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌పై గంగూలీ ప్ర‌శంస‌ల జ‌ల్లు

ganguly praises srh bowler
  • ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ అద్భుతంగా ఉంద‌న్న గంగూలీ
  • 150 కిలోమీట‌ర్ల వేగంతో బంతులు వేస్తున్నాడ‌న్న సౌర‌వ్
  • ఆ బౌలింగ్ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంద‌ని వ్యాఖ్య‌
ప్ర‌స్తుత ఐపీఎల్ సీజ‌న్‌లో స‌న్‌ రైజ‌ర్స్ హైద‌రాబాద్ పేస్ బౌల‌ర్ ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా రాణిస్తుండ‌డం ప‌ట్ల బీసీసీఐ చైర్మన్ సౌర‌వ్ గంగూలీ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. తాజాగా ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... ఈ సీజ‌న్‌ ఐపీఎల్ లో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ అద్భుతంగా ఉంద‌ని చెప్పారు. ఆయ‌న 150 కిలోమీట‌ర్ల వేగంతో బంతులు వేస్తున్న‌ట్లు తెలిపారు. 

ఉమ్రాన్ బౌలింగ్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంద‌ని చెప్పారు. అలాగే, ఉమేశ్ యాద‌వ్‌, ఖ‌లీల్ అహ్మ‌ద్ కూడా రాణిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. అయితే, అంద‌రి కంటే ఉమ్రాన్ మాలిక్ ఈ టోర్నీలో హైలైట్ గా నిలుస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. తాను కూడా ఐపీఎల్ టోర్నీని చాలా ఆస‌క్తితో చూస్తున్నాన‌ని గంగూలీ అన్నారు. 

ప్ర‌స్తుత సీజ‌న్‌లో అన్ని జ‌ట్లూ అద్భుతంగా ఆడుతున్నాయ‌ని, గెలిచే అవ‌కాశాలు అన్ని జ‌ట్ల‌కూ ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు. ముఖ్యంగా గుజ‌రాత్, ల‌క్నో కొత్త జ‌ట్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. కాగా, ఉమ్రాన్ వేస్తోన్న బంతుల‌కు ప్ర‌త్య‌ర్థులు వ‌ణికిపోతున్నార‌ని క్రికెట్ అభిమానుల నుంచీ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.
Sourav Ganguly
Cricket
srh
ipl

More Telugu News