రాజమండ్రిలో మొబైల్ థియేటర్...తొలి చిత్రంగా ఆచార్య ప్రదర్శన
- 120 సీట్లతో మొబైల్ థియేటర్ సిద్ధం
- రేపు రాజమండ్రిలో ప్రారంభం కానున్న మొబైల్ థియేటర్
- ఏసీ సౌకర్యం కూడా అందుబాటులో ఉన్న వైనం
ఇలాంటి థియేటర్ ఒకటి ఏపీలోని రాజమహేంద్రవరం ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రాంచరణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆచార్య సినిమాను ఈ థియేటర్లో తొలుత ప్రదర్శించనున్నారు. ఆచార్య సినిమా శుక్రవారం విడుదల అవుతున్న సందర్భంగా ఈ మొబైల్ థియేటర్ రేపు ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఏసీ సౌకర్యం కలిగిన ఈ మొబైల్ థియేటర్లో 120 సీట్లు ఉన్నాయి.