13 రోజుల్లో ' కేజీఎఫ్ 2' వసూళ్లు ఇవే!
- ఈ నెల 14వ తేదీన 'కేజీఎఫ్ 2' విడుదల
- భారీ వసూళ్లతో దూసుకుపోతున్న సినిమా
- 13 రోజుల్లో 942 కోట్లకి పైగా వసూళ్లు
- పార్టు 3 కూడా ఉంటుందని చెప్పిన హీరో యశ్
విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 121.30 కోట్ల గ్రాస్ ను .. 75.45 కోట్ల షేర్ ను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా 942 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టింది. వసూళ్ల పరంగా ఇంకా ఈ సినిమా కొత్త రికార్డులను సెట్ చేసే పనిలోనే ఉంది.
ప్రశాంత్ నీల్ టేకింగ్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. యశ్ యాక్టింగ్ .. సంజయ్ దత్ విలనిజం .. ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయి. పార్టు 3 కూడా ఉంటుందని యశ్ చెప్పిన దగ్గర నుంచి అందరిలో మళ్లీ ఆసక్తి మొదలైంది. మరి పార్టు 3 రంగంపైకి రావడానికి ఎంత సమయం పడుతుందనేది చూడాలి.