Acharya: ఆచార్య సినిమా టికెట్ కనీస ధరను ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం

Acharya Movie minimum ticket in AP is Rs 70
షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా విడుదలైన తర్వాత పది రోజులపాటు నాన్ ప్రీమియం, ప్రీమియం అన్న తేడా లేకుండా అన్ని కేటగిరీలపైనా రూ.50 పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. ఫలితంగా ఇప్పుడు ఆ సినిమా కనీస టికెట్ ధర రూ.70కి చేరుకుంది. అలాగే, మల్టీప్లెక్స్‌లలో గరిష్ఠంగా రూ.300 చేరుకుంది. 

కాగా, మార్చి 7న ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పేదలకు సినిమా వినోదాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రతి థియేటర్‌లో కనీసం 25 శాతం సీట్లు నాన్ ప్రీమియం కేటగిరీకి కేటాయించాలని ఆదేశించింది. పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు నాన్  ప్రీమియం, ప్రీమియం అన్న తేడా లేకుండా అన్ని కేటగిరీలకు ఒకేలా ధరలు పెంచుకోవచ్చని పేర్కొంది. 

కాగా, ఇటీవల విడుదలైన రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలకు కూడా టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అయితే, అంతకుముందు విడుదల చేసిన పవన్ కల్యాణ్ సినిమా ‘భీమ్లానాయక్’ సినిమాకు మాత్రం ఇలాంటి అవకాశం లేకుండా పోయింది.
Go Back to Shorts
Acharya
Andhra Pradesh
Tollywood
Chiranjeevi
Tickets

More Telugu News