గులాబీ దళం బలం, ధనమెంతో చెప్పిన కేసీఆర్
- 60 లక్షల మంది సభ్యులున్నారన్న కేసీఆర్
- పార్టీ ఖాతాలో రూ.865 కోట్లు ఉన్నాయని వెల్లడి
- రెండు ఇన్నోవాలు, ఓ ఫోర్టు కారు వున్నాయన్న కేసీఆర్
అనంతరం పార్టీ దగ్గర ఉన్న నిధులు, ఆస్తుల విలువలను కూడా కేసీఆర్ బయటపెట్టారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. "మన దగ్గర నిధులు పుష్కలంగా ఉన్నాయి. టీఆర్ఎస్ ఖాతాలో రూ.865 కోట్ల నిధులున్నాయి. వెయ్యి కోట్ల అసెట్స్ కలిగిన పార్టీ టీఆర్ఎస్. పార్టీకి రెండు ఇన్నోవాలు, ఒక ఫోర్డు కారు ఉంది" అని ఆయన చెప్పుకొచ్చారు.