దక్షిణాదిలో మాది కపూర్ ఫ్యామిలీ కావాలనుకున్నా: చిరంజీవి

Wanted My Family To Become Kapoor Family Says Chiranjeevi
  • ఈ విషయాన్ని పవన్ కు చెప్పానన్న చిరంజీవి 
  • పవన్ నుంచి అల్లు అర్జున్ దాకా అంతా స్టార్ స్టేటస్ తెచ్చుకున్నారని వ్యాఖ్య 
  • ‘ఆచార్య’ తమ కుటుంబానికి ప్రత్యేకమని వెల్లడి
‘ఆచార్య’ అరంగేట్రానికి సమయం ఆసన్నమైపోయింది. ఎల్లుండే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులను పలకరించేందుకు వచ్చేస్తున్నాడు. ఈ సందర్భంగా ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్నారు ఆచార్యగా మారిపోయిన చిరంజీవి. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చరణ్ తో స్క్రీన్ పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ‘ఆచార్య’ తన కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చారు. 

దక్షిణాదిలో తన కుటుంబం కపూర్ ఫ్యామిలీ కావాలనుకున్నానని చిరూ పేర్కొన్నారు. హిందీలో కపూర్ కుటుంబానికి ఓ ప్రాధాన్యం ఉందని, ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్లంతా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారని చెప్పారు. వారికున్న పేరు, ఫేమ్ ను చూసి తనకెంతో ముచ్చటేసిందని తెలిపారు. అందుకే తన కుటుంబం కపూర్ ఫ్యామిలీలా ఎదగాలనుకుంటున్నట్టు పవన్ కల్యాణ్ తో చెప్పానని ఆయన గుర్తు చేసుకున్నారు. 

ఈ రోజు పవన్ నుంచి అల్లు అర్జున్ దాకా తన కుటుంబం నుంచి వచ్చిన వారంతా హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని, కెరీర్ లో ఎత్తుపల్లాలతో తమకంటూ సొంత స్టార్ స్టేటస్ ను తెచ్చుకున్నారని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Tollywood
Chiranjeevi
Acharya
Ramcharan
Pawan Kalyan
Allu Arjun

More Telugu News