Faf du Plessis: టాస్ కోసం రెండు సార్లు కాయిన్ ను ఎగరేసిన ఫాప్ డూప్లెసిస్

Faf du Plessis asked to spin the coin twice at toss vs RR as RCB captain interrupts broadcaster introduction
షార్ట్స్‌లో చూడండి
టాస్ రెండోసారి వేయడం గురించి ఎప్పుడైనా విన్నామా..? తాజాగా ఈ పరిణామం చోటు చేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాప్ డూప్లెసిస్ ఇదే పనిచేశాడు. ఐపీఎల్ సీజన్ 2022లో 39వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మంగళవారం పూణెలోని ఎంసీఏ స్టేడియంలో జరిగింది. 

ఈ ఏడాది ఐపీఎల్ బ్రాడ్ కాస్టర్ ప్రతినిథి నిక్ నైట్ రెండు జట్ల కెప్టెన్లు సంజు శామ్సన్, ఫాప్ డూప్లెసిస్ ను పరిచయం చేసే పనిలో ఉన్నాడు. ఈ లోపే (చెప్పక ముందే) డూప్లెసిస్ అనుకోకుండా కాయిన్ ను తిప్పి గాల్లోకి ఎగరేశాడు. అది చూసిన నిక్ నైట్ కొద్దిగ ఆగాలంటూ కోరాడు. దీంతో డూప్లెసిస్ ఎగరేసిన కాయిన్  కింద పడకుండా చేత్తో పట్టుకున్నాడు. ఆ తర్వాత తిరిగి మళ్లీ తిప్పుతూ ఎగరేశాడు. ఆశ్చర్యకరంగా టాస్ డూప్లెసిస్ నే వరించింది.
Go Back to Shorts
Faf du Plessis
spin
twice
RR as RCB

More Telugu News