గులాబీ మయంగా భాగ్యనగరి.. జీహెచ్ఎంసీపై బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఫైర్
- ప్లీనరీ నేపథ్యంలో నగరమంతా గులాబీ జెండాలు
- టీఆర్ఎస్‌కు నిబంధనలు వర్తించవా అన్న ఎన్వీఎస్ఎస్
- రాత్రిలోగా తొలగించాలని జీహెచ్ఎంసీకి అల్టిమేటం
ఇతర రాజకీయ పార్టీలు ఇలా నగరంలో జెండాలు, కటౌట్లు పెడితే జరిమానాలు విధిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు టీఆర్ఎస్ జెండాలపై ఎందుకు స్పందించరని ప్రభాకర్ మండిపడ్దారు. ఇతర పార్టీలకు వర్తించే ఆంక్షలు అధికార టీఆర్ఎస్‌కు వర్తించవా? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా రాత్రిలోగా నగరంలో వెలసిన టీఆర్ఎస్ జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్లను తొలగించాలని ఆయన జీహెచ్ఎంసీ అధికారులకు అల్టిమేటం జారీ చేశారు.