పువ్వాడను కమ్మ కులం నుంచి బహిష్కరించాలన్న రేవంత్... ఏ విచారణకైనా సిద్ధమన్న పువ్వాడ
- ఖమ్మంలో రేవంత్ పర్యటన
- పీసీసీ చీఫ్ అయ్యాక తొలిసారి రాక
- కార్యకర్తలను ఉత్సాహపరిచిన వైనం
- పువ్వాడే సీబీఐ విచారణ కోరాలని డిమాండ్
- స్పందించిన పువ్వాడ
కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి భయపెట్టాలని చూస్తున్నాడని, కాంగ్రెస్ కార్యకర్తలు భయపడాల్సిన అవసరంలేదని రేవంత్ స్పష్టం చేశారు. తమ కార్యకర్తలపై వేధింపులకు పాల్పడే అధికారుల పేర్లను డైరీలో రాసిపెడుతున్నామని, రేపు వారు ఎక్కడున్నా తీసుకొచ్చి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేశారు. పువ్వాడను కమ్మ పెద్దలు కులం నుంచి కూడా బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో, మంత్రి పువ్వాడ స్పందించారు. తాను ఏ విచారణకైనా సిద్ధమేనని అన్నారు. భూములు కబ్జా చేశానని తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, కావాలంటే సీబీఐతో దర్యాప్తు చేయించుకోవాలని సవాల్ విసిరారు.