Balakrishna: బాల‌కృష్ణ గురించి అవాస్తవ వార్త‌ల‌ను వ్యాప్తి చేయకూడ‌దు: బాల‌య్య ప్ర‌తినిధులు

balakrishna visits hospital for regular checkup
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మోకాలికి డాక్టర్లు సర్జరీ చేశార‌ని త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విష‌యాన్ని వైద్యులే త‌మ‌కు తెలిపారని ప‌లు మీడియా సంస్థ‌లు వార్త‌లు ప్ర‌చురిస్తుండ‌డంతో దీనిపై బాల‌కృష్ణ ప్ర‌తినిధులు స్పందిస్తూ.. బాల‌య్య‌కు స‌ర్జరీ జ‌రిగిందంటూ జ‌రుగుతోన్న ప్ర‌చారంలో వాస్తవం లేదని స్ప‌ష్టం చేశారు. 

రెగ్యులర్‌ చెకప్‌ కోసమే ఆయన ఆసుప‌త్రికి వెళ్లారని చెప్పారు. ద‌య‌చేసి బాల‌కృష్ణ గురించి అవాస్తవ వార్త‌ల‌ను వ్యాప్తి చేయకూడ‌ద‌ని వారు విజ్ఞ‌ప్తి చేశారు. కాగా, 'అఖండ' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న 107వ చిత్రంలో నటిస్తున్నారు. నేడు హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో జరిగిన షూటింగ్‌లోనూ బాల‌కృష్ణ‌ పాల్గొన్నారు.
Go Back to Shorts
Balakrishna
Tollywood

More Telugu News