Bhupalapally: భూపాల‌ప‌ల్లి కేటీపీపీలో భారీ పేలుడు.. ఏడుగురికి గాయాలు

fire accident in bhupalapally ktpp
షార్ట్స్‌లో చూడండి
భూపాల‌ప‌ల్లిలోని కాక‌తీయ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ (కేటీపీపీ)లో సోమ‌వారం రాత్రి భారీ ప్ర‌మాదం సంభ‌వించింది. ప్లాంట్‌లో జ‌రిగిన పేలుడు కార‌ణంగా ఇద్ద‌రు కేటీపీపీ ఉద్యోగుల‌తో పాటు మ‌రో ఐదుగురు కూలీలు గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డ్డ‌వారిలో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే వేగంగా స్పందించిన అధికారులు గాయ‌ప‌డ్డవారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

భూపాల‌ప‌ల్లి కేటీపీపీ 500 మెగా యూనిట్ల ఉత్ప‌త్తి కేంద్రంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. కోల్ పంపించే మిల్లులో ఉన్న‌ట్టుండి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ పేలింది. ఈ పేలుడు కార‌ణంగా ప్లాంట్‌లో పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. ఓ వైపు మంట‌ల‌ను అదుపు చేసే ప‌నిని చేప‌ట్టిన అధికారులు.. మరోపక్క క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.
Go Back to Shorts
Bhupalapally
KTPP
Fire Accident

More Telugu News