ఫ్రాన్స్ అధ్యక్షుడిని స్వయంగా కలసి అభినందించనున్న ప్రధాని!
- మే 2 నుంచి 6 వరకు ఐరోపాలో ప్రధాని మోదీ పర్యటన
- పారిస్ లో మెక్రాన్ తో చర్చలు
- జర్మనీ చాన్స్ లర్ స్కాల్జ్ తోనూ భేటీ
కోపెన్ హెగెన్ లో జరిగే ఇండియా-నార్డిక్ సదస్సును ఉద్దేశించి కూడా ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. భారత్-ఫ్రాన్స్ మధ్య సన్నిహిత రాజకీయ, రక్షణ సంబంధాలు కొనసాగుతున్నాయి. నూతన తరం సాంకేతిక టెక్నాలజీలపై కలసి పనిచేసేందుకు రెండు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే రక్షణ ఉత్పత్తుల తయారీ విషయంలో ఆత్మినిర్భర్ భారత్ కు ఫ్రాన్స్ మద్దతుగా ఉంది.