హిందీ ఇక నుంచి ఏమాత్రం జాతీయ భాష కాదు: కిచ్చ సుదీప్ వ్యాఖ్యలు
- బాలీవుడ్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తోందన్న సుదీప్
- తెలుగు, తమిళంలో డబ్ చేసేందుకు ప్రయత్నాలని వ్యాఖ్య
- బాలీవుడ్ ప్రముఖులు ఎంతో కష్టపడుతున్నారన్న నటుడు
- బాలీవుడ్ సినిమాలు అంతగా విజయం సాధించలేకపోతున్నాయని వ్యాఖ్య
హిందీ ఇక నుంచి ఏమాత్రం జాతీయ భాష కాదని, బాలీవుడ్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తోందని చెప్పాడు. సినిమాలను తెలుగు, తమిళంలో డబ్ చేసేందుకు బాలీవుడ్ ప్రముఖులు ఎంతో కష్టపడుతున్నారని అన్నాడు. అయితే, ఆ బాలీవుడ్ సినిమాలు అంతగా విజయం సాధించలేకపోతున్నాయని, మనం తీస్తున్న సినిమాలను మాత్రం ప్రపంచం మొత్తం చూస్తున్నారని ఆయన చెప్పాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా, ఈగ, బాహుబలి, సైరా వంటి సినిమాల్లో నటించి సుదీప్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హీరోగా విక్రాంత్ రోణ సినిమాలో నటిస్తున్నాడు.