'నారా వారి దత్తపుత్రుడు' అనే సినిమా తీయాలనుకుంటున్నాం: పవన్ పై మంత్రి అంబటి విమర్శలు
- తనను చంద్రబాబు దత్తపుత్రుడు అనొద్దని పవన్ వార్నింగ్
- లెక్కచేయని ఏపీ మంత్రులు
- పవన్ మాపై సెటైర్లు వేయవచ్చా? అంటూ అంబటి ఫైర్
- నన్ను రాంబో రాంబాబు అనలేదా? అంటూ ఆగ్రహం
"మాపై వ్యంగ్యంగా మాట్లాడే పవన్ తనపై మాత్రం సెటైర్లు వేయవద్దంటున్నారు. నన్ను రాంబో రాంబాబు అనలేదా?" అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. పవన్ కు స్క్రీన్ ప్లే మాత్రమే వచ్చని, తమకు సినిమా తీయడం కూడా వచ్చని స్పష్టం చేశారు. 'నారా వారి దత్తపుత్రుడు' అనే సినిమా తీయాలనుకుంటున్నామని వెల్లడించారు. అయినా, పొత్తు లేకుండా పోటీ చేసే దమ్ము పవన్ కల్యాణ్ కు ఉందా? అని అంబటి రాంబాబు సవాల్ విసిరారు.