పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్

  • పశ్చిమ గోదావరి జిల్లాలో నిన్న పవన్ పర్యటన
  • కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం
  • వైసీపీ సర్కారుపై పవన్ విమర్శలు
  • మండిపడిన అమర్నాథ్
  • చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ వ్యాఖ్యలు
ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లాలో నిన్న  కౌలు రైతు భరోసా యాత్ర సందర్భంగా పవన్ కల్యాణ్చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. జగన్ సర్కారుపై చంద్రబాబు దత్తపుత్రుడు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కౌలు రైతుల కష్టాలకు కారణం చంద్రబాబేనని దత్తపుత్రుడు తెలుసుకోవాలని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. రైతులను మోసం చేసిన చంద్రబాబును ప్రశ్నించకుండా, జగన్ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని అన్నారు. ప్రతి కౌలు రైతుకు సీఎం జగన్ పరిహారం అందిస్తున్నారని స్పష్టం చేశారు. 

బహుభార్యలతో విలువలు లేని వ్యక్తి పవన్ అని ఆయన రెండో భార్య రేణు దేశాయ్ చెప్పారని గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ భార్యలు ఉన్న వ్యక్తి పవన్ అని, అలాంటి వ్యక్తి సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నాడని విమర్శించారు. రుణమాఫీపై రైతులను మోసం చేసిన చంద్రబాబును నాడు పవన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. చంద్రబాబు దత్తపుత్రుడు అని చెప్పడానికి ఈ నిదర్శనం చాలదా? అని అన్నారు.

Gudivada Amarnath
Pawan Kalyan
Chandrababu
CM Jagan

More Telugu News