కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై చర్చ

political strategist prashant kishor meets trs chief kcr
  • నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు చర్చలు
  • నేడు కూడా కొనసాగనున్న చర్చలు
  • సర్వే వివరాలను అందించిన పీకే
  • టీఆర్ఎస్‌కే పనిచేస్తానని స్పష్టీకరణ
కాంగ్రెస్‌ అధిష్ఠానంతో గత కొన్ని రోజులుగా వరుస సమావేశాలు జరుపుతున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నిన్న టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన చర్చలు నేడు కూడా కొనసాగనున్నట్టు సమాచారం. గత రాత్రి ఆయన ప్రగతి భవన్‌లోనే బస చేయడం ఇందుకు ఊతమిస్తోంది.

వచ్చే ఎన్నికల కోసం టీఆర్ఎస్‌తో ఇప్పటికే ఒప్పందం చేసుకున్న పీకే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై తన బృందంతో కలిసి  సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా 30 నియోజకవర్గాల్లో జరిపిన సర్వే వివరాలను కేసీఆర్‌కు అందించారు. ఆ తర్వాత 89 నియోజకవర్గాల్లో జరిపిన సర్వే వివరాలను కేసీఆర్‌కు తాజాగా అందించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో వరుస సమావేశాల నేపథ్యంలో ముందు టీఆర్ఎస్‌తోనే ఒప్పందం కుదిరింది కాబట్టి తాను ఆ పార్టీకే పనిచేస్తానని పీకే  స్పష్టం చేసినట్టు తెలిసింది.
Go Back to Shorts
Prashant Kishor
KCR
Telangana

More Telugu News