రక్తదానం చేసిన పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా!
- 18 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టిన అకీరా
- తొలిసారి రక్తదానం చేసిన పవన్ తనయుడు
- ఇన్స్టాగ్రామ్ లో ఫొటో షేర్ చేసిన రేణు దేశాయ్
18 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టిన అకీరా తొలిసారి రక్తదానం చేశాడని రేణు తెలిపారు. మన రక్తం ఎంతో విలువైనదని... అవసరమైన వారికి రక్తం ఇవ్వాలని కోరారు. 18 ఏళ్లలో అడుగుపెట్టిన వారు రక్తదానం చేయాలని చెప్పారు. మీరు ఇచ్చిన రక్తం మరో వ్యక్తి ప్రాణాన్ని కాపాడుతుందని అన్నారు.