కొడాలి నానికి జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నారా?... మ‌ట్టి మాఫియాపై బుద్ధా వెంక‌న్న సెటైర్లు

budda venkanna comments on gravel mafia in gudivada
  • కొడాలి నాని ఏపీ ప‌రువు తీస్తున్నారన్న వెంకన్న 
  • కొడాలి క్యాసినో నిర్వ‌హించినా సీఎం ప‌ట్టించుకోలేదని విమర్శ 
  • ఇన్ని దారుణాలు జ‌రుగుతున్నా సీఎం ప‌ట్టించుకోరా? అంటూ మండిపాటు 
కృష్ణా జిల్లా గుడివాడ‌లో వెలుగు చూసిన మ‌ట్టి మాఫియా అరాచ‌కాల‌పై టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న తాజాగా స్పందించారు. తాజా మాజీ మంత్రి కొడాలి నాని నియోజ‌కవ‌ర్గ‌మైన గుడివాడ‌లో దారుణాలు ఎన్ని జ‌రుగుతున్నా...సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ట్టించుకోవడం లేద‌ని ఆయ‌న ఆరోపించారు. ఇదంతా చూస్తుంటే కొడాలి నానికి సీఎం జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్న‌ట్లుగా ఉంద‌ని వెంకన్న సెటైర్లు సంధించారు.

శుక్ర‌వారం ఉద‌యం మీడియా ముందుకు వ‌చ్చిన వెంక‌న్న మాట్లాడుతూ ... 'కొడాలి నాని ఏపీ ప‌రువు తీస్తున్నారు. గుడివాడ‌లో పోలీసులు స‌రిగా ప‌నిచేయ‌డం లేదు. మట్టి త‌వ్వకాల‌ను ప‌ట్టించుకోని పోలీసుల‌పై చ‌ర్య‌లేవీ? కొడాలి క్యాసినో నిర్వ‌హించినా సీఎం ప‌ట్టించుకోలేదు. గుడివాడ‌లో ఇన్ని దారుణాలు జ‌రుగుతున్నా సీఎం ప‌ట్టించుకోరా? కొడాలి నానికి సీఎం జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నారా?' అని ప్రశ్నించారు. 
Go Back to Shorts
Gudivada
Krishna District
TDP
Budda Venkanna

More Telugu News