మార్షల్ ఆర్ట్స్ వ‌చ్చిన వారికి ప్ర‌భాస్ సినిమాలో ఛాన్స్‌!

chance in prabhas movie
  • ప్ర‌క‌ట‌న చేసిన వైజ‌యంతీ మూవీస్
  • ప్రభాస్ కొత్త‌ సినిమా ప్రాజెక్ట్ కే లో న‌టించ‌వచ్చని వివ‌ర‌ణ‌
  • [email protected] కు వివ‌రాలు పంపొచ్చు
ప్రభాస్ కొత్త‌ సినిమా 'ప్రాజెక్ట్ కే'లో న‌టించాల‌నుకునే వారికి ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ స్వాగ‌తం ప‌లుకుతోంది. మార్షల్ ఆర్ట్స్‌లో టాలెంట్ ఉన్నవారు, పార్కౌట్ ప్లేయ‌ర్స్, న్యూ ఏజ్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్ వంటివి వ‌చ్చిన వారు ప్ర‌భాస్ సినిమాలో న‌టించ‌వ‌చ్చ‌ని చెప్పింది. 

ఆసక్తి ఉన్నవారు  [email protected] అడ్ర‌స్‌కి త‌మ వివ‌రాలు పంపాల‌ని కోరింది. ఇంత‌కు ముందు కూడా ప‌లు విభాగాల్లో వైజ‌యంతీ మూవీస్ ఆస‌క్తి ఉన్న వారిని ఈ సినిమాలో భాగ‌స్వాములు అయ్యేందుకు ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. వైజ‌యంతీ మూవీస్‌కి ఇది 50వ సినిమా. టాలెంట్ ఉండి అవ‌కాశాల కోసం ఎదురు చూస్తోన్న వారికి ఇందులో అవ‌కాశం క‌ల్పిస్తోంది.  

కాగా,  నాగ్ అశ్విన్ రూపొందిస్తోన్న‌ ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపిక పదుకొణె నటిస్తోన్న విష‌యం తెలిసిందే. ఇందులో అమితాబ్ బచ్చన్ కూడా ముఖ్య పాత్రలో న‌టిస్తున్నారు. 


                   
Go Back to Shorts
Prabhas
Tollywood

More Telugu News