Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వివేకా హ‌త్య కేసు విచార‌ణ‌కు హాజ‌రైన సునీల్ కుమార్ యాద‌వ్‌ సోదరుడు

  • మూడో ద‌ఫా ద‌ర్యాప్తును ప్రారంభించిన సీబీఐ
  • ఇప్ప‌టికే ఈ కేసులో అరెస్టైన సునీల్ కుమార్ యాద‌వ్‌
  • తాజాగా సునీల్ సోద‌రుడు కిర‌ణ్ కుమార్ యాద‌వ్‌ను విచారించిన సీబీఐ
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు ద‌ర్యాప్తును సీబీఐ మ‌రోమారు ప్రారంభించింది. ఇప్ప‌టికే రెండు దఫాలుగా ఈ కేసు దర్యాప్తును చేప‌ట్టిన సీబీఐ.. ప‌లు కీల‌క వివ‌రాల‌తో కోర్టులో చార్జిషీట్ల‌ను కూడా దాఖ‌లు చేసింది. ద‌ర్యాప్తులో కాస్తంత గ్యాప్ ఇచ్చిన సీబీఐ... తాజాగా గురువారం మూడో విడ‌త విచార‌ణ‌ను ప్రారంభించింది.

ఈ విచార‌ణ‌లో భాగంగా ఈ కేసులో అరెస్టైన సునీల్ కుమార్ యాద‌వ్ సోద‌రుడు కిర‌ణ్ కుమార్ యాద‌వ్‌ను సీబీఐ అధికారులు గురువారం విచారించారు. ఈ కేసులో చిక్కుకోవ‌డానికి ముందు వైసీపీకి సంబంధించి పులివెందుల కార్య‌వ‌ర్గంలో కీల‌క కార్య‌క‌ర్త‌గా సునీల్ వ్య‌వ‌హరించిన సంగ‌తి తెలిసిందే. ద‌ర్యాప్తులో భాగంగా ప‌లు కీల‌క సాక్ష్యాల‌ను సేక‌రించిన సీబీఐ ఇటీవ‌లే సునీల్‌ను అరెస్ట్ చేసింది.  
CBI
YS Vivekananda Reddy
Pulivendula

More Telugu News