ఖమ్మంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్... సాయిగణేశ్ కుటుంబానికి పరామర్శ
- ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేశ్
- టీఆర్ఎస్ నేతలు, పోలీసుల వేధింపులే కారణమంటున్న బీజేపీ
- సాయి గణేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఖమ్మం వచ్చిన కేంద్ర మంత్రి
- ఇప్పటికే బాధిత కుటుంబంతో ఫోన్ ద్వారా మాట్లాడిన అమిత్ షా
ఈ ఘటనపై బీజేపీ తెలంగాణ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ బుధవారం నాడు తన పాదయాత్రకు విరామం ఇచ్చి దీక్షకు దిగారు. ఇదిలా ఉంటే... ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా సాయి గణేశ్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించిన సంగతి తెలిసిందే.