KTR: కూలిన కేటీఆర్ బ‌హిరంగ స‌భ టెంట్లు... త‌ప్పిన పెను ముప్పు

ktrs warangal public meeting tetnts collapsed
షార్ట్స్‌లో చూడండి
వ‌రంగ‌ల్‌లో తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు పెను ప్ర‌మాదం త‌ప్పింది. బుధ‌వారం నాడు వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన కేటీఆర్ ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేస్తున్నారు. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న వరంగ‌ల్‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఆ బ‌హిరంగ స‌భ‌కు కేటీఆర్ వెళ్లేందుకు ఇంకో గంట స‌మ‌యం ఉండ‌గానే.. బ‌హిరంగ స‌భ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయాయి. 

వ‌రంగ‌ల్‌లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం గాలి దుమారం రేగింది. ఈ ప్ర‌భావంతో కేటీఆర్ బ‌హిరంగ స‌భ టెంట్లు కూలిపోయాయి. అయితే కేటీఆర్ స‌భ‌కు హాజ‌రు కాక‌ముందే ఈ ఘటన జ‌ర‌గ‌డంతో పెను ప్ర‌మాద‌మే త‌ప్పింది.  
Go Back to Shorts
KTR
TRS
Warangal
Public Meeting

More Telugu News