చార్మినార్ వద్ద మిడ్ నైట్ బిర్యానీ రుచిచూసిన రాజమౌళి

Rajamouli tastes midnight biryani at Charminar
  • హైదరాబాద్ లో రంజాన్ సీజన్
  • జిగేల్మంటున్న పాతబస్తీ
  • చార్మినార్ వద్ద నైట్ బజార్ కోలాహలం
  • తనయుడు కార్తికేయతో కలిసి వెళ్లిన రాజమౌళి
హైదరాబాద్ పాతబస్తీలో రంజాన్ శోభ వెల్లివిరుస్తోంది. చార్మినార్ వద్ద నైట్ బజార్ పర్యాటకులు, ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది. టాలీవుడ్ అగ్రదర్శకుడు రాజమౌళి కూడా చార్మినార్ నైట్ బజార్ ను సందర్శించారు. తనయుడు కార్తికేయతో కలిసి అర్ధరాత్రి వేళ చార్మినార్ వద్దకు వెళ్లిన రాజమౌళి అక్కడి ఫేమస్ బిర్యానీ రుచి చూశారు. రాజమౌళి రాకతో చార్మినార్ వద్ద సందడి నెలకొంది. ఆయనతో సెల్ఫీలకు జనాలు పోటీలుపడ్డారు. వారిని నిరుత్సాహపరచకుండా రాజమౌళి వారితో కలిసి ఫొటోలు దిగారు.
Go Back to Shorts
Rajamouli
Biryani
Charminar
Old City
Ramadan
Hyderabad
Tollywood

More Telugu News