Andhra Pradesh: ఏపీ హోం మంత్రిగా తానేటి వ‌నిత ప‌ద‌వీ బాధ్య‌త‌ల స్వీకారం

  • తొలి కేబినెట్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా వ‌నిత‌
  • మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో సైతం ప‌ద‌విని పొందిన వైనం
  • ఏకంగా హోం శాఖ‌ను ద‌క్కించుకున్న వనిత 
  • క్విక్లీ రెస్పాన్స్ విధానంతో పనిచేస్తామని వెల్ల‌డి
taneti vanita takes charge as ap home minister

ఆంధ్రప్రదేశ్‌ హోం శాఖ మంత్రిగా తానేటి వనిత సోమవారం ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. జ‌గ‌న్ తొలి కేబినెట్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ప‌నిచేసిన తానేటి వ‌నితకు కేబినెట్ పునర్వ్యవస్థీకరణలోనూ అవ‌కాశం ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా శాఖ‌ల కేటాయింపుల్లోనూ ప్ర‌మోష‌న్ ద‌క్కించుకున్న వ‌నిత ఏకంగా హోం మంత్రిత్వ శాఖ‌ను చేజిక్కించుకున్నారు. ఇటీవ‌లే రెండోసారి మంత్రిగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేసిన వ‌నిత‌... తాజాగా సోమ‌వారం హోం శాఖ మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ .. సీఎం జగన్‌ అప్పగించిన బాధ్యతను శక్తి వంచన లేకుండా నిర్వర్తిస్తానని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీస్, క్విక్లీ రెస్పాన్స్ విధానంతో పనిచేస్తామని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో మూడు ఏళ్లుగా సీఎం జగన్‌ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో ఏపీకి జాతీయ అవార్డులు కూడా తీసుకొచ్చారని కొనియాడారు. టెక్నాలజీ వినియోగంలోనూ మన పోలీస్ విభాగం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్న వ‌నిత‌.. రాబోయే రెండేళ్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తాన‌ని తెలిపారు.

More Telugu News