సన్ రైజర్స్ సంచలన పేసర్ పై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు
- పంజాబ్ కింగ్స్ పై ఉమ్రాన్ మాలిక్ విశ్వరూపం
- ఆఖరి ఓవర్లో 3 వికెట్లు తీసిన వైనం
- కేటీఆర్ ఫిదా
- ఐపీఎల్ లోనే అత్యుత్తమం అంటూ వ్యాఖ్యలు
ఈ తిరుగులేని ప్రదర్శనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా అచ్చెరువొందారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. విపరీతమైన బలంతో ఉమ్రాన్ మాలిక్ విసిరే బంతులు నమ్మశక్యం కాని రీతిలో ఉంటున్నాయని కితాబిచ్చారు. బహుశా ఇవాళ్టి మ్యాచ్ లో అతడి ప్రదర్శన ఐపీఎల్ లోనే అత్యుత్తమం అయ్యుంటుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అందుకే ఈ యువ ఆటగాడికి అభివందనం చేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు.