Ayyanna Patrudu: టీడీపీ అంతు చూసే సీన్ మీకు లేదు... విజయసాయిరెడ్డిపై అయ్య‌న్న‌పాత్రుడి సెటైర్‌

ayyannapatrudu satires on vijay sai reddy
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డిపై టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు ట్విట్ట‌ర్ వేదిక‌గా సెటైర్లు సంధించారు. టీడీపీ అంతు చూస్తామంటూ సాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావించిన అయ్య‌న్న‌.. టీడీపీ మొద‌లే చూడ‌ని వైసీపీ నేత‌లకు టీడీపీ అంతు చూసే సీనే లేద‌ని సెటైర్లు సంధించారు.

శ‌నివారం రాత్రి వ‌రుస‌గా సంధించిన ట్వీట్ల‌లో అయ్య‌న్న పేర్కొంటూ..  సాయిరెడ్డి, నువ్వు ఇంకా టీడీపీ మొదలే చూడలేదు.. అంతు చూసేంత సీన్ నీకు లేదు. నువ్వు, మీ నాయకుడు టీడీపీ మొదలు చూసేలోపే మరోసారి జైల్లో చిప్పకూడు తినిపిస్తాం. టీడీపీ అంతు చూడటం మీ నాయకుడి బాబు వల్లే కాలేదు, నువ్వెంత? విశాఖలో వేసిన చిల్లర వేషాల కారణంగా అడుగుపెడితే కాళ్లు విరగ్గొడతా అని జగన్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు 26 జిల్లాలు తిరుగుతా అని బీరాలు పలుకుతున్నాడు వీసా రెడ్డి' అని ఆయ‌న ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
Ayyanna Patrudu
TDP
Vijay Sai Reddy

More Telugu News