Chiranjeevi: చిరంజీవి 'ఆచార్య' ప్రీరిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా జగన్!

Jagan is the chief guest for Chiranjeevi movie Acharya pre release event
షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమా ప్రీరిలీజ్ ఈమెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఏపీ ముఖ్యమంత్రి జగన్ హాజరవుతున్నారు. ఈ నెల 23న విజయవాడలో ప్రీరిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా ఒక పాత్రను పోషించారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 

ఏప్రిల్ 29న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించారు. ప్రతి నాయకుడి పాత్రను సోనుసూద్ పోషించాడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
Go Back to Shorts
Chiranjeevi
Acharya Movie
Pre release event
chief guest
Jagan
YSRCP

More Telugu News