'జయమ్మ పంచాయితీ' ట్రైలర్ ఆవిష్కరించిన పవన్ కల్యాణ్
- సుమ ప్రధాన పాత్రలో జయమ్మ పంచాయితీ
- విజయ్ కుమార్ దర్శకత్వంలో చిత్రం
- కీరవాణి సంగీతం.. మే 6న రిలీజ్
విజయ్ కుమార్ దర్శకత్వంలో వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం మెల్లగా హైప్ పెంచుకుంటోంది. పవన్ కల్యాణ్ ట్రైలర్ రిలీజ్ చేయడంతో అందరి దృష్టి జయమ్మ పంచాయితీపై పడింది. బలగా ప్రకాశ్ నిర్మాతగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.