ఢిల్లీ మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన ఆ యువతి మృతి

  • అక్షర్‌ధామ్ మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన యువతి
  • 40 అడుగుల ఎత్తు నుంచి పడడంతో గాయాలు
  • చికిత్స పొందుతూ మృతి
ఢిల్లీలోని అక్షర్‌ధామ్ మెట్రో స్టేషన్ నుంచి దూకి తీవ్ర గాయాలపాలైన ఆ యువతి మృతి చెందింది. గురువారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో అక్షర్‌ధామ్ మెట్రో స్టేషన్‌లోని రెండో నంబరు ప్లాట్‌ఫామ్ అంచుకు చేరుకున్న పంజాబ్‌ యువతి (22) ఒక్కసారిగా కిందికి దూకేసింది. సమాచారం అందుకుని అప్పటికే అక్కడికి చేరుకున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినిపించుకోలేదు.

కిందనున్న కొందరు సీఐఎస్ఎఫ్ సిబ్బంది దుప్పటి సాయంతో ఆమె కిందపడిపోకుండా కాపుకాశారు. అయితే, దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి దూకడంతో గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడామె చికిత్స పొందుతూ నిన్న మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.

New Delhi
Akshardham Metro
Suicide

More Telugu News