హైదరాబాదులో రేపు హనుమాన్ శోభాయాత్ర... మద్యం షాపుల బంద్

ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. రేపు నగరంలో హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించనున్నారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్ బండ్ హనుమాన్ ఆలయం వరకు ఈ శోభాయాత్ర సాగనుంది. 

ఈ నేపథ్యంలో నగరంలో పలు ఆంక్షలు విధించారు. 24 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు బార్లు, వైన్ షాపులు, కల్లు కాంపౌండ్ లు మూసివేయాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు.

Hanuman Shobha Yatra
Wine Shops
Bars
Closure
Hyderabad
Police

More Telugu News