గుజరాత్ టైటాన్స్ పై టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్
- ముంబయి డీవై పాటిల్ స్టేడియంలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
- చెరో మూడు విజయాలతో సమ ఉజ్జీలుగా ఉన్న జట్లు
ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్ జట్టులో ట్రెంట్ బౌల్ట్ స్థానంలో జిమ్మీ నీషామ్ ను తీసుకున్నారు. బౌల్ట్ స్వల్పగాయంతో బాధపడుతున్నాడు. అటు గుజరాత్ జట్టులో రెండు మార్పులు చేశారు. దర్శన్ నల్కండే స్థానంలో యశ్ దయాళ్... సాయి సుదర్శన్ స్థానంలో విజయ్ శంకర్ ఆడుతున్నారు.