MI: టాస్ గెలిచిన ముంబై.. పంజాబ్‌కు బ్యాటింగ్ అప్ప‌గింత‌

mi wins toss elected to field first
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్‌-2022లో భాగంగా బుధ‌వారం నాడు ముంబై ఇండియ‌న్స్‌, పంజాబ్ కింగ్స్ మ‌ధ్య కాసేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో కాసేప‌టి క్రితం ముగిసిన టాస్‌లో ముంబై విన్న‌ర్‌గా నిల‌వ‌గా.. తొలుత బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న రోహి‌త్ శ‌ర్మ సేన‌.. పంజాబ్ కింగ్స్‌ను ఫ‌స్ట్ బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

ఇప్ప‌టిదాకా ఈ సీజ‌న్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన ముంబై నాలుగింటిలోనూ ఓట‌మిపాలైంది. ఐపీఎల్ టైటిళ్ల‌ను అంద‌రి కంటే ఎక్కువ సార్లు చేజిక్కించుకున్న ముంబై.. ఇలా పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌తో అభిమానుల‌ను నిరాశ‌ప‌రుస్తోంది. చెన్నై సూప‌ర్ కింగ్స్ మాదిరే ఈ మ్యాచ్‌లో అయినా ముంబై విజ‌యం సాధిస్తుందా? అన్న దిశ‌గా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఇక నాలుగు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌.. రెండింటిలో విజయం సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో 7వ స్థానంలో ఉంది.
Go Back to Shorts
MI
Mumbai Indians
PBKS
Punjab Kings
IPL 2022

More Telugu News