ప్రభుత్వం చివరి గింజ కొనేవరకు మా పోరాటం ఆగదు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
- ఇప్పటికే వరి అమ్మి నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలన్న కోమటిరెడ్డి
- ఇతర పంటలు వేసి నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వాలని డిమాండ్
- 111 జీవోపై అఖిలపక్ష భేటీ పెట్టాలని గవర్నర్‌ను కోరతామని వ్యాఖ్య
ప్రభుత్వం చెప్పినట్లు ఇతర పంటలు వేసి నష్టపోయిన వారికి కూడా పరిహారం ఇవ్వాలని ఆయన అన్నారు. 111 జీవోపై అఖిలపక్ష భేటీ పెట్టాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కోరతామని ఆయన చెప్పారు. 111 జీవో పరిధిలో ఆక్రమణలపై సీబీఐ విచారణ కోరతామని చెప్పారు. అలాగే, మూసీ ప్రక్షాళనపై గవర్నర్‌కు వివరిస్తామని తెలిపారు.