Andhra Pradesh: ఏపీలో ఇద్దరికి కరోనా పాజిటివ్... తాజా బులెటిన్ విడుదల

Two more positive cases in AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో ఒకటీ అరా కేసులు తప్ప కరోనా వ్యాప్తిపై ఆందోళనకర పరిస్థితి ఏమాత్రం లేదు. గడచిన 24 గంటల్లో 1,988 కరోనా పరీక్షలు నిర్వహించగా, 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1 కేసు గుర్తించారు. అదే సమయంలో 16 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. 

ఏపీలో ఇప్పటివరకు 23,19,614 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,841 మంది ఆరోగ్యవంతులయ్యారు. కేవలం 43 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 14,730 మంది కరోనాతో మరణించారు. 
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Positive Cases

More Telugu News